: రక్త పరీక్షతో అల్జీమర్స్ కనిపెట్టేయొచ్చు


మెదడును దశలవారీగా నాశనం చేసే ఆల్జీమర్స్ (వృద్ధాప్యంలో వచ్చే మతిమరపు)ను గుర్తించడం ఇకపై మరింత సులువు కానుంది. ఒక చిన్న రక్త పరీక్షతో ఈ వ్యాధిని తొలిదశలోనే గుర్తించేందుకు దోహదం చేసే పది ప్రోటీన్లను కనుగొన్నట్లు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్ర్తవేత్త సిమోన్ లోవ్ స్టోన్ తెలిపారు. ఇప్పటిదాకా ఆల్జీమర్స్ వ్యాధిని తొలిదశలో కనిపెట్టడం సాధ్యమయ్యేది కాదు. వ్యాధి బాగా ముదిరిన తర్వాతే దీనిని గుర్తించేందుకు సాధ్యమయ్యేది. దీంతో వ్యాధి నిర్ధారణయ్యేసరికే రోగి అత్యంత ప్రమాదకర స్థితికి చేరిపోయేవాడు. అప్పుడు అతనికి ఎంత మంచి వైద్యం చేసినా ఫలితం ఉండేది కాదు. అయితే, లండన్ లోని కింగ్స్ కాలేజీలో సిమోన్ నేతృత్వంలో జరిగిన పరిశోధనలు ఆల్జీమర్స్ ను తొలిదశలోనే గుర్తించేందుకు అవసరమయ్యే ప్రోటీన్లను కనుగొన్నాయి.

  • Loading...

More Telugu News