: లోక్ సభ రేపటికి వాయిదా
నాలుగుసార్లు వాయిదా పడిన అనంతరం ఈ సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమైన లోక్ సభలో బీజేపీ, తృణమూల్ ఎంపీల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. బీజేపీ ఎంపీలు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ తృణమూల్ మహిళా ఎంపీలు సభలో మండిపడ్డారు. అటు ఈ ఆరోపణలను ఖండించిన బీజేపీ, సర్దుబాటుకు ప్రయత్నించామే తప్ప వారిని దూషించలేదని పేర్కొంది. కానీ, సభలో గందరగోళం నెలకొనడం, సమావేశాలు సజావుగా సాగేందుకు వీలులేకపోవడంతో స్పీకర్ స్థానంలో ఉన్న కొనకళ్ల నారాయణ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, అటు రైల్వే బడ్జెట్ ను ఎండీఎంకే స్వాగతించింది.