: జీటీవీ ఆఫీసుపైనా ఆర్టిస్టుల రాళ్ల దాడి


డబ్బింగ్ సీరియళ్లపై ఆందోళన హింసాత్మక రూపం దాల్చింది. శుక్రవారం మాటీవీ, రామానాయుడు స్టూడియోలపై దాడి చేసిన అగంతకులు అర్ధరాత్రి జి తెలుగు కార్యాలయంపై రాళ్లతో విరుచుకుపడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు వాహనాలలో వచ్చి రాళ్లు విసరడంతో కార్యాలయ అద్దాలు ధ్వంసమయ్యాయి. అనంతరం వారు అక్కడి నుంచి పరారయ్యారు. తెలుగు టీవీ చానళ్లు డబ్బింగ్ సీరియళ్లను నిలిపివేయాలని గత నెల రోజులుగా బుల్లితెర ఆర్టిస్టులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఉగాది నుంచి నిలిపివేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆర్టిస్టులే దాడులకు పాల్పడుతున్నారని అనుమానిస్తున్నారు. తాము డబ్బింగ్ సీరియళ్ల ప్రసారాన్ని క్రమక్రమంగా నిలిపివేస్తామని మా టీవీ ప్రకటించగా.. తాము పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఈటీవీ ఎప్పుడో ప్రకటించింది. దర్శకరత్న దాసరి, పలు పార్టీల నేతలు డబ్బింగ్ సీరియళ్లకు వ్యతిరేకంగా ఆర్టిస్టులకు మద్దతునిస్తున్నారు.

  • Loading...

More Telugu News