: తిరిగి ప్రారంభమైన లోక్ సభ... మళ్లీ వాయిదా
వాయిదా అనంతరం మూడు గంటలకు లోక్ సభ తిరిగి ప్రారంభమైంది. అయినా, సభలో పలువురు సభ్యులు స్పీకర్ వెల్ లోకి వెళ్లి పెద్దపెట్టున నినాదాలు చేస్తుండడంతో, సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఆ సమయంలోనే హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు సవరణలను ప్ర్రవేశపెట్టారు. అదే సమయంలో పోలవరం ఆర్డినెన్స్ పై టీఆర్ఎస్ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో, సభ 3.30 గంటలకు వాయిదా పడింది.