: స్టాక్ మార్కెట్లు డౌన్
రైల్వే బడ్జెట్ స్టాక్ మార్కెట్ పై అంతగా ప్రభావం చూపలేదు. ఫలితంగా రైల్వే సంబంధిత స్టాక్స్ 5 నుంచి 13 శాతం తిరోగమించాయి. పలు ప్రతిపాదనలు, ప్రాజెక్టులపై రైల్వే మంత్రి స్పష్టత ఇవ్వలేకపోవడమే అందుకు కారణమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. బిజినెస్ ఫ్రెండ్లీ రైల్వే బడ్జెట్ ను ఆశిస్తున్న మార్కెట్ లో గత నెల రోజుల నుంచి స్టాక్స్ ర్యాలీ కొనసాగింది. అలాంటిది, స్టాక్స్ ఇవాళ ఒక్కసారిగా పతనం దిశగా పయనించాయి.