: రాజధానిపై అంతిమ నిర్ణయం కేంద్రానిదే: శివరామకృష్ణన్ కమిటీ


ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఆగస్టులోపు కేంద్రానికి నివేదిక అందజేస్తామని శివరామకృష్ణన్ కమిటీ తెలిపింది. అనంతపురం జిల్లాలో పర్యటించిన సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, రాష్ట్ర రాజధాని విషయంలో అంతిమ నిర్ణయం కేంద్రానిదేనని స్పష్టం చేశారు. రాజధాని ఏర్పాటుపై ఇప్పటి వరకు ఐదువేల దరఖాస్తులు అందాయని కమిటీ వెల్లడించింది. రాజధాని, ఉపరాజధాని అంశాల ప్రతిపాదనలతో కేంద్రానికి రాజధానిపై నివేదిక అందజేస్తామని కమిటీ వెల్లడించింది.

  • Loading...

More Telugu News