: కార్డుతో కొనుగోళ్లకు సీక్రెట్ నెంబర్ టైప్ చేస్తారా?


డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వినియోగం విషయంలో జూలై 1 నుంచి నూతన నిబంధన అమలులోకి రానుంది. దీని ప్రకారం షాపింగ్ చేయాలంటే కార్డును స్వైప్ చేసిన తర్వాత సీక్రేట్ పిన్ నంబర్ టైప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే కొన్ని బ్యాంక్ డెబిట్ కార్డుల వాడకానికి ఈ నిబంధన ఉంది. కాకపోతే ఇది అన్నిటికీ వర్తిస్తుంది. అయితే ఇది తప్పనిసరి కాదు. ఇదొక ఆప్షన్. వద్దు అనుకుంటే పిన్ నంబర్ టైప్ చేయకుండానే కార్డుతో షాపింగ్ చేసుకోవచ్చు. ఏటా రూ.30కోట్ల విలువైన దొంగ లావాదేవీలు(అంటే ఒకరి కార్డును వేరే వారు వినియోగించడం) జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్డు లావాదేవీలను మరింత భద్రంగా మార్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిబంధన అమలు చేయాలని బ్యాంకులను కోరింది.

  • Loading...

More Telugu News