: ఐదేళ్లలో పేపర్ లెస్ రైల్వే కార్యాలయాలు


రానున్న ఐదేళ్లలో రైల్వే కార్యాలయాలన్నీ పేపర్ లెస్ కార్యాలయాలుగా మారిపోనున్నాయి. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ మంగళవారం తన బడ్జెట్ ప్రసంగంలో పేపర్ లెస్ కార్యాలయాల ఏర్పాటును ప్రధానంగా ప్రస్తావించారు. ఐటీ విప్లవం మానవ జీవితంలోని అన్ని అంశాలనూ స్పృశించడమే కాక పెను ప్రభావాన్నే తీసుకువచ్చిందని చెప్పిన మంత్రి, సదరు ఐటీని రైల్వేల్లోనూ పూర్తిగా వాడుకునేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. రానున్న ఐదేళ్లలో రైల్వే శాఖలోని అన్ని కార్యాలయాలను, విభాగాలను కంప్యూటరీకరించనున్నామని తెలిపారు. టికెట్ కౌంటర్లన్నింటిలో డ్యూయల్ డిస్ ప్లే ఇండికేటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. డిజిటల్ రిజర్వేషన్ చార్టులను అందుబాటులోకి తెస్తామన్నారు. పీపీపీ పద్దతిలో ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లను అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు.

  • Loading...

More Telugu News