: పాకిస్థాన్ లో 8 లక్షల మందిని తరలించారు!
పాకిస్థాన్ లో తీవ్రవాదులపై పోరాటం కోసం 8 లక్షల మంది ప్రజలను వారి నివాస స్థలాలనుంచి పాక్ సైనికులు తరలించారని పాక్ మీడియా పేర్కొంది. పాలుపోసి పెంచిన పాములా తీవ్రవాదం తమనే కాటేస్తుండడంతో, తట్టుకోలేకపోయిన పాక్ సైన్యం తీవ్రవాదులను ఏరివేసేందుకు ఆపరేషన్ ప్రారంభించింది. ఆ ఆపరేషన్ కు జర్బ్-ఏ-అజబ్ అని పేరు పెట్టారు. కరాచీ విమానాశ్రయంపై తీవ్రవాదులు దాడికి దిగడంతో పాక్ సర్కారు తీవ్రవాదులపై కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఈ నేపథ్యంలో నార్త్ వజీరిస్తాన్ లోని 62,493 కుటుంబాలను తరలించగా, వీరిలో 2,11,549 మంది పురుషులు, 2,36,883 మంది స్త్రీలు, 3,39,456 మంది చిన్నారులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. వారందరికీ ప్రభుత్వం ప్రకటించిన సహాయ నిధి, అవసరమైన వస్తువులు అందజేయాలని అధికారులను ప్రభుత్వ ప్రతినిధి ఆదేశించారు.