: తిరుమలలో విషాదం


తిరుమలలో నేడు ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. లేపాక్షి సర్కిల్ లో భారీ వృక్షం నేలకూలింది. గత రెండు రోజులుగా కురిసిన వర్షాల కారణంగా చెట్టు కూలినట్లు అధికారులు చెప్పారు. ఈ ఘటనలో తిరుపతికి చెందిన మధుసూదన్ అక్కడికక్కడే మరణించగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అశ్విని ఆసుపత్రికి తరలించారు. వారిలో మహారాష్ట్రకు చెందిన సరోజ, హర్షద్ పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం వారిరువురినీ తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు అశ్విని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.

  • Loading...

More Telugu News