: సదానందగౌడ రైల్వే బడ్జెట్ కు ప్రధాని మోడీ ప్రశంసలు
కేంద్ర మంత్రి సదానందగౌడ లోక్ సభలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ పై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు అనంతరం మీడియాతో ప్రధాని మాట్లాడుతూ, ఇది అధునాతన, రైల్వేలను మరింత ఆధునికీకరించే బడ్జెట్ అని అభిప్రాయపడ్డారు. దేశంలో 50 ప్రధాన స్టేషన్లలో శుభ్రతను ఔట్ సోర్సింగ్ కు అప్పగిస్తామని చెప్పారు. మహిళల భద్రతకు ఆర్పీఎఫ్ మహిళా పోలీసులను నియమిస్తామని, రైల్వేలను ప్రపంచంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.