: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ: సదానందగౌడ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు రైల్వేమంత్రి సదానంద గౌడ లోక్ సభలో తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో 29 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు రూ.20,680 కోట్లు అవసరమని వెల్లడించారు.