: చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి వాన తాకిడి


హైదరాబాదులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి క్యాంపు కార్యాలయం లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కు వాన తాకిడి తప్పలేదు. గతరాత్రి కురిసిన భారీ వర్షానికి కార్యాలయం మొదటి అంతస్తులో భారీగా నీళ్ళు చేరాయి. అంతేగాకుండా, చంద్రబాబు వ్యక్తిగత సిబ్బందికి చెందిన గది పైకప్పు కూలిపోయింది. ఆఫీసు నుంచి బాబు బయటకెళ్ళిన కాసేపటికే ఈ ఘటన జరిగింది. అయితే, పైకప్పు కూలిపోయిన సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పంది. ఈ పరిణామాల నేపథ్యంలో లేక్ వ్యూలో కార్యకలాపాలపై అనిశ్చితి ఏర్పడింది.

  • Loading...

More Telugu News