: కమల్ హాసన్ కు గాయాలు
ప్రముఖ బహుభాషా నటుడు కమలహాసన్ గాయపడ్డారు. 'ఉత్తమ విలన్' సినిమా షూటింగ్ లో ఆయన గాయపడినట్టు సమాచారం. తిరుపతి బ్రదర్స్ పతాకంపై దర్శకుడు లింగుసామి నిర్మిస్తున్న ఉత్తమ విలన్ సినిమాలో కమలహాసన్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమాకు కమల్ హాసన్ మిత్రుడు, కన్నడ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని పోరాట దృశ్యాలను చిత్రీకరిస్తుండగా ఆయన కాలుకు గాయాలయ్యాయి. దీంతో ఆయనను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో షూటింగ్ రద్దు చేశామని, ఆయన కోలుకున్న తరువాత షూటింగ్ ప్రారంభిస్తామని దర్శకుడు రమేష్ అరవింద్ తెలిపారు. ఈ సినిమాలో కమల్ హాసన్ సరసన ఆండ్రియా, పూజాకుమార్, పార్వతి నటిస్తున్నారు.