: యూట్యూబ్ ను ఊపేస్తున్న సన్నీ లియోన్ 'పింక్ లిప్స్'


బాలీవుడ్ చిత్రం 'హేట్ స్టోరీ-2'లో సన్నీ లియోన్ ఐటెం సాంగ్ 'పింక్ లిప్స్' ఇప్పుడు యూట్యూబ్ ను ఊపేస్తోంది. ఇప్పటికే పదిలక్షల వ్యూస్ తో దూసుకెళుతోంది. జులై 2న ఈ గీతాన్ని యూట్యూబ్ లోకి అప్ లోడ్ చేశారు. కాగా, ఈ పాటలో సన్నీ లియోన్ మత్తెక్కించే బాడీ లాంగ్వేజి కుర్రకారును గిలిగింతలు పెట్టడం ఖాయం. ఈ వెరీ హాట్ గీతానికి మీట్ బ్రదర్స్ అంజన్ సంగీతం సమకూర్చారు. కుమార్ రచించగా ఖుష్బూ గ్రేవాల్ ఆలపించారు. సన్నీ ఈ పాటకు పూర్తిగా న్యాయం చేసి ఉంటుందన్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. టీవీ నటులు జయ్ భానుషాలి, సుర్వీన్ చావ్లా జంటగా తెరకెక్కిన ఈ సినిమా జూలై 18న విడుదల కానుంది.

  • Loading...

More Telugu News