: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంను ఆశ్రయించిన నళిని


దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఎస్.నళిని తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సెక్షన్ 435(1) క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ ను సవాల్ చేస్తూ ఆమె సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నిబంధన ప్రకారం సీబీఐ చేత విచారణ చేయబడిన వారిని శిక్షాకాలం కంటే ముందే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉండదు. ఇలా ఎవరినైనా విడుదల చేయాలంటే... రాష్ట్రాలు కేంద్రాన్ని సంప్రదించాలి. తమిళనాడులో జీవితఖైదు పడిన 2,200 మంది దోషులు పదేళ్లకంటే ముందుగానే విడుదలవడం గత 15 ఏళ్లలో తాను చూశానని నళిని తెలిపింది. కానీ, తన కేసు సీబీఐ దర్యాప్తు చేసినందువల్ల ఈ మినహాయింపు నుంచి తప్పించారని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేగాక, తన కేసు 435(1)(ఏ) కింద విచారణ చేశారని, ఈ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని నళిని ఆరోపిస్తోంది. గత 23ఏళ్ల నుంచి జైల్లో ఉంటున్న ఆమెకు 1998, జనవరి 28న ట్రయల్ కోర్టు మరణ శిక్ష విధించింది. అనంతరం 2000, ఏప్రిల్ 24న తమిళనాడు గవర్నర్ తనకు క్షమాభిక్ష పెట్టి జీవితకాల శిక్షగా మార్చారు.

  • Loading...

More Telugu News