: హార్స్ లీ హిల్స్ లో అసాంఘిక కార్యకలాపాల జోరు


ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హార్స్ లీ హిల్స్ లో అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ వ్యభిచారం నడుస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో వారు ఈ రోజు ఉదయం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఒక యువతి, ఏడుగురు విటులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

ఎత్తైన కొండలతో, పచ్చదనంతో వేసవిలోనూ చల్లగా ఉండే ఈ ప్రాంతానికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. పోలీసులు చూసీ చూడనట్లు ఉండడం వల్లే ఇది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News