: బీజేపీలో చేరనున్న ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత


బీజేపీలోకి ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి, సీనియర్ నేత రామ్ మాధవ్ (49) చేరిక ఖాయమైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నెల రోజుల క్రితమే ఈ నిర్ణయం జరిగినప్పటికీ... నిన్న జరిగిన సంఘ్ సమావేశంలో ఆమోదముద్ర వేశారు. ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి చేరికలు కొత్తేమీ కాదు. గతంలో రామ్ లాల్, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ తదితరులు బీజేపీలో చేరక ముందు అనేక సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన వారే. బీజేపీతో ఆర్ఎస్ఎస్ ను సమన్వయం చేసేందుకు ఈ చేరికలు ఉపయుక్తంగా ఉంటాయని సంఘ్ పెద్దలు భావిస్తుంటారు.

  • Loading...

More Telugu News