: సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రాణం తీసిన బస్సు
హైదరాబాదు ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న వరుణ్ గౌడ్ అనే వ్యక్తి నేడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బాలానగర్ లో నివాసముండే వరుణ్ వీకెండ్ లో విద్యానగర్ లో ఉన్న స్నేహితులతో గడిపి తిరిగి వచ్చే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఓయూ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో అతను ప్రయాణిస్తున్న కారును ఆర్టీసీ సిటీ బస్సు బలంగా ఢీకొన్నది. దీంతో, కారు తుక్కుతుక్కయిపోయింది. తీవ్ర గాయాలైన వరుణ్ ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వరుణ్ అవివాహితుడు. స్వస్థలం మెదక్ జిల్లా రామచంద్రాపురం.