: జయలలిత ఇష్టసఖి శశికళ భర్త అరెస్ట్?


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ భర్త నటరాజన్ ను అరెస్ట్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయనను నిన్న అరెస్ట్ చేశారని... ప్రస్తుతం చెన్నై తీసుకొస్తున్నారని తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే, ప్రముఖ కరాటే ఛాంపియన్ హూసైనీని నటరాజన్ తుపాకీతో బెదిరించినట్టు చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు అందింది. దీంతో, ఈ ఘటనకు సంబంధించి తిరువాన్మయూర్ పోలీసులు విచారణ జరిపారు. ఈ క్రమంలో, కుట్రాలంలోని తన సొంత బంగ్లాలో నటరాజన్ ఉన్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నటరాజన్ అరెస్ట్ వ్యవహారం అన్నాడీఎంకే వర్గాల్లో అలజడి రేపుతోంది.

  • Loading...

More Telugu News