: హైదరాబాదులో 10,916 ఎకరాల స్వాధీనానికి రంగం సిద్ధం


హైదరాబాదును పారిశ్రామికంగా మరింత అభివృద్ధిపథంలోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ సర్కార్ ప్రయత్నిస్తోంది. అందుకే హైదరాబాద్ చుట్టపక్కల ఉన్న ఖాళీ స్థలాల కోసం డేగ కళ్లతో వెతుకుతోంది. ఈ క్రమంలో గతంలో వివిధ సంస్థలకు కేటాయించిన భూముల వివరాలను సేకరించింది. ఈ నేపథ్యంలో, స్థలాలను కేటాయించినప్పటికీ, వాటిని ఉపయోగించుకోకుండా నిరుపయోగంగా ఉంచిన 10,916 ఎకరాలను అధికారులు గుర్తించారు. ఇవన్నీ గ్రేటర్ పరిధిలోని 16 మండలాల్లో ఉన్నాయి. ఈ భూముల విలువ తక్కువలో తక్కువ రూ. 50 వేల కోట్లు ఉంటుందని అంచనా. వీటిని స్వాధీనం చేసుకోవడానికి ఇప్పటికే సగం భూములకు అధికారులు నోటీసులు ఇచ్చారు. మరో 5 వేల ఎకరాలకు నోటీసులు రెడీ చేస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న భూముల్లో ఏపీఐఐసీ వద్ద 2806 ఎకరాలు, హెచ్ఎం డీఏ వద్ద 2902 ఎకరాలు, దిల్, ఏపీహెచ్ బీ, ఆర్జీకే వద్ద 3449 ఎకరాలు, రాజీవ్ స్వగృహ వద్ద 900 ఎకరాలు, ప్రైవేటు సంస్థల వద్ద 475 ఎకరాలు ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News