: ఎంబీబీఎస్ సీటు కావాలంటే కోటి రూపాయలు చెల్లించాల్సిందే!
తమిళనాడు, పుదుచ్చేరిలలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఎంబీబీఎస్ సీటు కావాలంటే కోటి రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. దీనిపై మద్రాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. తమిళనాడు, పుదుచ్చేరిలో 50 వరకు మెడికల్ కాలేజీలు ఉండగా, వాటిలో సగం వరకు ప్రైవేటు కాలేజీలే! ఈ విధంగా అధిక మొత్తంలో సొమ్ము చెల్లించి ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులు... భవిష్యత్తులో డాక్టర్లుగా అయ్యాక డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేసి వైద్య వృత్తికి కళంకం తెచ్చే అవకాశం ఉందని దరఖాస్తుదారు న్యాయస్థానానికి విన్నవించారు. ఈ పిటిషన్ పై విచారణను ప్రారంభించిన కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.