: ‘నాటా’ మహాసభలు ముగిశాయ్


ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) మహాసభలు అమెరికాలో ఆదివారం నాడు ఘనంగా ముగిశాయి. అమెరికాలోని అట్లాంటాలోని జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ లో పండుగ వాతావరణంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ ముగింపు వేడుకల్లో భాగంగా తెలంగాణ అభివృద్ధిలో ప్రవాసాంధ్రుల పాత్ర, ఇరు రాష్ట్రాల్లో పెట్టుబడులపై చర్చ, బిజినెస్ సెమినార్ నిర్వహించారు. నరాల రామిరెడ్డి అష్టావధానం, భలే జోడీ గేమ్ షో, ఫ్యాషన్ షో వీక్షకులను అలరించాయి. మిస్ అమెరికా నీనా దావులూరి, సినీ తారలు తమన్నా, ప్రణీతలు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యంకు నాటా కార్యవర్గం జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసింది. అనంతరం ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ నిర్వహించిన సంగీత విభావరి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. సభల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి, అతిథులకు నాటా కార్యవర్గం ధన్యవాదాలు తెలుపడంతో సభలు ముగిశాయి. ఈ ఉత్సవాల్లో టీటీడీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు, గేయ రచయితలు సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, సినీ నటీమణులు సుధ, లయ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News