: గోడ కూల్చివేతతో రేగిన గొడవ


విజయనగరంలోని పోలీసు కార్యాలయం వద్ద గోడ కూల్చివేత గొడవకు దారితీసింది. ప్రజలకు అసౌకర్యంగా ఉందన్న కారణంగా మున్సిపల్ సిబ్బంది గోడను కూల్చివేశారు. దీంతో కోపోద్రిక్తుడైన ఎస్సీ ఇక్భాల్ అహ్మద్ మున్సిపల్ కమిషనర్, సిబ్బందిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. పోలీసుల తీరును మున్సిపల్ సిబ్బంది కలెక్టర్ కాంతిలాల్ దండే దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి మృణాళిని సమక్షంలో కలెక్టర్ ఎస్పీతో ఫోన్ లో మాట్లాడారు. మున్సిపల్ స్థలంలో గోడను కూల్చివేస్తే కేసులు ఎందుకు పెడుతున్నారంటూ కలెక్టర్ ఎస్పీని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News