: రంగరాజన్ కమిటీపై మాయావతి విసుర్లు
ఏ ప్రాతిపదికలతో రంగరాజన్ కమిటీ పేదలను నిర్ధారించిందో చెప్పాలని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఏస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. దేశంలో ప్రతి పదిమందిలో ముగ్గురు పేదలేనని రంగరాజన్ కమిటీ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఏఏ అంశాలను ఆధారం చేసుకుని రంగరాజన్ కమిటీ ఈ తరహా నివేదికలు రూపొందించిందని మాయావతి ప్రశ్నల వర్షం కురిపించారు. రంగరాజన్ నివేదిక దేశంలోని పేదలను అవమానపరిచే విధంగా ఉందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకు పట్టణాల్లో రూ. 47, గ్రామాల్లో రూ. 32ల కంటే తక్కువ ఖర్చు చేసే వారంతా పేదలేనని రంగరాజన్ కమిటీ కేంద్ర ప్రణాళిక సంఘానికి నివేదించిన సంగతి తెలిసిందే.