: భయపెట్టే బీజాల్ని నాటింది వైఎస్సే: టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు
సమర్థమైన నాయకుడు ఉంటే అభివృద్ధికి ఢోకా లేదని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు అన్నారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు పాలనలో భయపడింది అంతర్జాతీయ నేరగాళ్లేనని అన్నారు. సామాన్యులు, పారిశ్రామికవేత్తలు ధైర్యంగా ఉన్నారన్నారు. భయపెట్టే బీజాల్ని నాటింది వైఎస్సేనని కాల్వ శ్రీనివాసులు అన్నారు. టీడీపీ బీ-ఫారంపై గెలిచిన వాళ్లని భయపెట్టి మార్చింది వైఎస్సేనని ఆయన స్పష్టం చేశారు. పరిటాల రవిని హత్య చేయించింది కూడా వైఎస్సేనని ఆయన అన్నారు. చంద్రబాబు అప్రజాస్వామికంగా ఉంటే కడప జిల్లా పరిషత్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కేదా? అని ఆయన నిలదీశారు. కడపలో వైఎస్సార్సీపీ గెలిస్తే ప్రజాస్వామికం, ఇతర పార్టీలు గెలిస్తే అప్రజాస్వామికమా? అని ఆయన ప్రశ్నించారు. జగన్ ప్రజాస్వామిక విధానాల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆయన ఎద్దేవా చేశారు.