: న్యాయవాది పల్లవి హంతకుడికి జీవిత ఖైదు


ముంబై మహిళా న్యాయవాది పల్లవి పురకయస్థ హంతకుడికి జీవిత ఖైదు విధిస్తూ ముంబై కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ముంబై నగరం, వాడాలాలోని హిమాలయన్ హైట్స్ లో పల్లవి నివాసముండేవారు. అక్కడ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సజ్జద్ మొగల్ పల్లవిపై కన్నేశాడు. ఈ క్రమంలోనే 2012 ఆగస్టు 9న బలవంతంగా పల్లవి నివాసంలోకి చొరబడ్డ సజ్జద్ ఆమెపై లైంగిక వేధింపులకు దిగాడు. అయితే పల్లవి అతడిని తీవ్రంగా ప్రతిఘటించింది. అంతేకాక తన కాబోయే భర్త అవిక్ సేన్ గుప్తకు విషయాన్ని చేరవేసింది. దీంతో అతడు పల్లవిపై దాడి చేశాడు. ఈ దాడిలో పల్లవి మరణించారు. దీనిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసి, అదే ఏడాది అక్టోబర్ లో చార్జిషీటు దాఖలు చేశారు. లైంగిక వేధింపులు, హత్య తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా సెషన్స్ న్యాయమూర్తి జోషి 46 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడటమే కాక పల్లవిని హత్య చేసిన విషయం కుడా రుజువు కావడంతో జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఇదిలా ఉంటే పల్లవి కాబోయే భర్త అవిక్ కూడా 2013లో మరణించారు.

  • Loading...

More Telugu News