: బాద్‌షా కోరిక కోరే ‘మకావ్‌’ అంటే ఇదే!


బాద్షా సినిమా చూశారా? అందులో విలన్‌ అడిగిన ఒక పని చేసిపెట్టడానికి .. ఎన్టీఆర్‌ మకావ్‌ ను నాకిచ్చేయాలి అని అడుగుతాడు. ఇంతకీ ఏమిటీ మకావ్‌ అని మీలో చాలా మందికి సందేహం వచ్చే ఉండాలి. మకావ్‌ అంటే ఏమిటంటే..

పర్యాటక రంగంలో విపరీతమైన క్రేజీ దేశంగా ఎదిగిన ప్రాంతం అది. రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనాలో స్వతంత్ర ప్రతిపత్తితో కొనసాగుతోంది. కేవలం 30 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉండే మకావ్‌ జనాభా కేవలం ఐదున్నర లక్షలే. అయితే ఈ దేశానికి తాజా లెక్కల ప్రకారం రోజుకు 76 వేల మంది పర్యాటకులు వస్తుంటారు. జూదానికి ఇది ఫేమస్‌. 2012లో అక్కడకు మొత్తం 2.8 కోట్ల మంది పర్యాటకులు వచ్చార్ట. అక్కడ వంద స్టార్‌ హోటళ్లలోని 28వేల గదులు కూడా వారికి సరిపోలేదు.

  • Loading...

More Telugu News