: తెలంగాణ ప్రభుత్వ చర్యలు ఆందోళనకరంగా ఉన్నాయి: గల్లా జయదేవ్
రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ చర్యలు ఆందోళనకరంగా ఉన్నాయని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. హైదరాబాదులో సీమాంధ్రుల రక్షణ, వారి ఆస్తుల రక్షణపై నీలినీడలు కమ్ముకున్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో, హైదరాబాదు శాంతిభద్రలను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయిన గవర్నర్ చేతిలోనే ఉంచాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని స్పష్టం చేశారు.