: ఇదిగో... వరల్డ్ స్ట్రాంగెస్ట్ బీర్!


ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బీర్లలో ఆల్కహాల్ మహా అయితే 6 శాతం ఉంటుందేమో. కొన్ని వరల్డ్ క్లాస్ కంపెనీలు 20 శాతం ఆల్కహాల్ కలిగివుండే బీర్లు కూడా తయారుచేస్తున్నా... స్కాట్లాండ్ కు చెందిన బ్రూమీస్టర్ కంపెనీ తయారుచేసిన ఈ మహా బీరు ముందు దిగదుడుపే. దీంట్లో ఆల్కహాల్ శాతం 67.5 ఉంటుంది. ఒక్క గుక్కతాగినా కళ్ళు తేలిపోవడం ఖాయం. దీనిపేరు కూడా తగిన విధంగా పెట్టారు. 'స్నేక్ వీనమ్' అట! అంటే, పాము విషం!
దీన్ని గడగడా తాగేద్దామనుకుంటే కుదరదని తయారీదారులు చెబుతున్నారు. కొద్దికొద్దిగా రుచి చూస్తేనే శ్రేయస్కరం అని సెలవిస్తున్నారు. కంపెనీ వెబ్ సైట్ ద్వారా ఈ వరల్డ్ స్ట్రాంగెస్ట్ బీరు అమ్మకాలు జరుపుతున్నారు. ఒక్క బాటిల్ ఖరీదు రూ. 4077 మాత్రమేనట..!

  • Loading...

More Telugu News