: జపాన్ ను వణికిస్తున్న 'నియొగురి'


పసిఫిక్ మహాసముద్రం పశ్చిమప్రాంతంలో ఏర్పడిన భారీ టైఫూన్ ఇప్పుడు జపానును వణికిస్తోంది. గంటకు 160 మైళ్ళ వేగంతో దూసుకువస్తున్న ఈ టైఫూన్ కు 'నియొగురి' అని నామకరణం చేశారు. జపాన్ కు దక్షిణాన ఉన్న ద్వీప సమాహారాన్ని నియొగురి రేపు తాకవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. జపాన్ భూభాగాన్ని మాత్రం ఎల్లుండి తాకే అవకాశాలున్నాయని తెలిపింది.
ఈ క్రమంలో ప్రజలు ఇళ్ళకే పరిమితం కావాలని హెచ్చరించింది. ఈ ఉదయానికి 'నియొగురి' దక్షిణ ఒకినావా ద్వీపానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉందని జపాన్ వాతావరణ్ శాఖ వెల్లడించింది.

  • Loading...

More Telugu News