: కామాంధ కస్టమ్స్ అధికారి పని మనిషినీ వదల్లేదు


అరాచకాల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. పని మనిషిని కూడా వదల్లేదు కామాంధుడు. లక్నోలో కస్టమ్స్ శాఖలో సూపరింటెండెంట్ గా పని చేస్తున్న సుశీల్ కుమార్ అనే వ్యక్తి తన బంధువుల ఇంట్లో పని చేస్తున్న పనిమనిషిపై కన్నేశాడు. దీంతో గత కొన్ని నెలలుగా ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు. 20 రోజుల క్రితం ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెను విచారించిన పోలీసులు, వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. కాగా, తన మేనత్తను సరిగా చూసుకోనందుకు ఆమెను పనిలోంచి తొలగించామని, అందుకే తనపై అత్యాచార ఆరోపణలు చేస్తోందని సుశీల్ కుమార్ చెబుతున్నాడు.

  • Loading...

More Telugu News