: అయ్యప్ప సొసైటీ కూల్చివేతలను పరిశీలించిన టి.టీడీపీ ఎమ్మెల్యేలు
హైదరాబాదులోని అయ్యప్ప సొసైటీ కూల్చివేతలను తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఓ విధానం అంటూ లేకుండా కూల్చివేయడం దారుణమని వారు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం బడా బాబుల జోలికి వెళ్లకుండా కేవలం పేదలనే టార్గెట్ చేసిందని ఆరోపించారు. బాధితులకు తాము అండగా ఉంటామన్నారు. సొసైటీలోని దాదాపు 26 భవన నిర్మాణాలను టీ ప్రభుత్వ ఆదేశాల మేరకు కూల్చివేసిన సంగతి తెలిసిందే.