: 33 రూపాయలు ఖర్చు పెడుతున్నారా?... అయితే మీరు ధనవంతులే!
పేదరికానికి ప్రమాణాలు మారిపోతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఓ మాదిరి కేజీ బియ్యం ధర 40 రూపాయల పైమాటే. అలాంటి పరిస్థితుల్లో కూడా గ్రామాల్లో రోజుకు 32 రూపాయలు, నగరాల్లో 47 రూపాయలు ఖర్చు పెట్టేవారంతా ధనికులేనని కేంద్రానికి నిపుణుల కమిటీ సూచించింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఇది పెను దుమారమే లేపింది.
అధికార, విపక్ష నేతలంతా నిపుణుల నివేదికపై అభ్యంతరం చెబుతున్నారు. సాక్షాత్తూ కేంద్ర మంత్రులే దీనిపై మండిపడుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థిక వేత్త రంగరాజన్ నేతృత్వంలోని కమిటీ ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు పేదవారే అని స్పష్టం చేస్తూ, రోజుకి 33 రూపాయలు ఖర్చు చేస్తే పేదలు కాదని తేల్చింది.
ఈ లెక్కన పేదలు కానివారంతా ఆహారానికి, విద్యకు, ఆరోగ్యానికి తగినంత సంపద కలిగి ఉన్నారని నిపుణుల కమిటీ స్పష్టం చేస్తోంది. దీనిపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రంగరాజన్ కమిటీకి రోజుకు 100 రూపాయలిస్తాం... ఎలా బతకాలో నేర్పించమంటామని ఎద్దేవా చేశాయి.