: నేమార్ స్థానంలో విలియన్... స్టార్ ను మరిపిస్తాడా?


కొలంబియాతో క్వార్టర్స్ సమరంలో తీవ్రంగా గాయపడిన సూపర్ ఫార్వర్డ్ నేమార్ స్థానంలో విలియన్ రంగప్రవేశం చేయనున్నాడు. ఈ మేరకు బ్రెజిల్ సాకర్ టీమ్ కోచ్ ఫిలిప్ స్కొలారి సూచనప్రాయంగా వెల్లడించారు. నేమార్ స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో తొలి ప్రాధాన్యత విలియన్ కే అని పేర్కొన్నారు. అయితే, విలియన్ ను జట్టు వ్యూహాల్లో భాగంగా ఏ పొజిషన్ లో ఆడించనున్నారన్నది ఇంకా ఖరారు కాలేదు. విలియన్ మిడ్ ఫీల్డర్ కావడంతో ఫార్వర్డ్ లైన్ లో ఎవరు ఉంటారన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.
కాగా, కోచ్ తనపై విశ్వాసం ప్రకటించడం పట్ల విలియన్ స్పందిస్తూ, నేమార్ ను ఎవరితోనూ పోల్చలేమని, అతనో నాణ్యమైన ఆటగాడని పేర్కొన్నాడు. "నాది విభిన్నమైన శైలి. నేమార్ మంచి స్ట్రయికర్, ఎక్కువ గోల్స్ కొడతాడు. అయితే, నేను అలాకాదు. జట్టులోని మిగతా ఆటగాళ్ళు గోల్ చేసేందుకు నావంతుగా సహకరిస్తా" అని తెలిపాడు.

  • Loading...

More Telugu News