: 'ప్రేమ కథా చిత్రం' ఆడియో రిలీజ్
సూపర్ స్టార్ కృష్ణ మేనల్లుడు సుధీర్ బాబు హీరోగా నటించిన 'ప్రేమ కథా చిత్రం' ఆడియో రిలీజ్ ఫంక్షన్ నేడు హైదరాబాద్ లో జరిగింది. 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' వంటి యూత్ ఫుల్ ఎంటర్ టెయినర్లకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన జె. ప్రభాకర రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన నందిత, హాసిక నాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను చిన్న సినిమాల హిట్ దర్శకుడు మారుతి నిర్మిస్తున్నాడు. జేబీ ఈ రొమాంటిక్ చిత్రానికి సంగీతం సమకూర్చారు. కాగా, ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణ, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, దిల్ రాజు, శ్రీను వైట్ల, బెల్లంకొండ సురేష్ తదితరులు హాజరయ్యారు.