: అక్కడ బూమ్... ఇక్కడ ఢామ్!


రాష్ట్ర విభజనకు ముందున్న పరిస్థితి, విభజన తర్వాత ఒక్కసారిగా తిరగబడింది. విభజనకు ముందు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు వరంగల్ లాంటి జిల్లాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటేవి. సీమాంధ్ర ప్రాంతం విషయానికి వస్తే విశాఖ, విజయవాడ తదితర ప్రాంతాలు మినహా మిగిలిన జిల్లాల్లో రియల్ బూమ్ అంతగా లేదన్నది తెలిసిందే. అయితే రాష్ట్ర విభజన అనంతరం ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. అవశేష ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధానిని ఎక్కడ నిర్మించాలనే విషయంపై సర్వేలు జరుగుతున్న నేపథ్యంలో సీమాంధ్రలోని గుంటూరు, కృష్ణా, ఒంగోలు జిల్లాల్లో ఒక్కసారిగా భూముల ధరలు భారీగా పెరిగిపోయాయి. కేవలం రెండు నెలల వ్యవధిలోనే అక్కడి భూముల విలువ వంద రెట్లకు పైగా పెరిగిందనేది మార్కెట్ వర్గాల విశ్లేషణ. అయితే తెలంగాణలోని జిల్లాల్లో మాత్రం రియల్ బూమ్ తలకిందులైంది. రెండు నెలలుగా వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో భూముల క్రయవిక్రయాలు దాదాపుగా స్తంభించాయట. ఈ క్రమంలో ఆయా జిల్లాల్లో రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా భారీగా తగ్గిపోయిందని సదరు శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

  • Loading...

More Telugu News