: నీలిచిత్రాలు చూస్తున్న టీచర్లపై సస్పెన్షన్ వేటు


వాళ్ళు సమాజంలో గౌరవనీయ వృత్తిలో ఉన్నవాళ్ళు. పిల్లలకు సద్బుద్ధులు నేర్పి, విద్యావంతులను చేయాల్సిన బాధ్యతను మోస్తున్న ఉపాధ్యాయులు. కానీ, పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన సమయంలో నీలి చిత్రాలు చూస్తూ పై అధికారులకు పట్టుబడ్డారు. సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని మధుర జిల్లా పాణిగావ్ లో జరిగిందీ ఘటన. అక్కడి ప్రభుత్వ పాఠశాలకు తనిఖీ నిమిత్తం వెళ్ళిన శ్యామ్ ప్రకాశ్ యాదవ్ అనే అధికారి అక్కడి సీన్ చూసి నిర్ఘాంతపోయారు.
హెడ్ మాస్టర్ మహావీర్ ప్రసాద్, అసిస్టెంట్ టీచర్ మొహర్ సింగ్, కాంట్రాక్టు టీచర్ ప్రవీణ్ కుమార్, క్లాస్ ఫోర్ ఉద్యోగి జయవీర్ సింగ్ లు నీలి చిత్రాల వీక్షణలో మునిగితేలుతున్న దృశ్యం కంటబడింది. దీంతో, ఆయన శాఖాపరమైన విచారణ చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ చంద్రకళ ఆదేశాల మేరకు... ప్రవీణ్ కుమార్ ను ఉద్యోగం నుండి తొలగించి, మిగతా ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేశారు. వీరిపై సైబర్ నేరాల చట్టాన్ని అనుసరించి కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News