: హైదరాబాదులో శాంతి భద్రతలు గవర్నర్ చేతికే అప్పగించాలి: రఘువీరారెడ్డి
హైదరాబాదులో శాంతి, భద్రతలు గవర్నర్ చేతికి అప్పగించాలన్న కేంద్రం నిర్ణయానికి ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మద్దతు పలికారు. దీన్ని వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రభుత్వ వ్యాఖ్యలపై కూడా స్పందించిన ఆయన, సెంటిమెంట్ కోసం అనవసర వివాదాలు రేపడం మంచిది కాదని సూచించారు. ఈ మేరకు రఘువీరా మీడియాతో మాట్లాడుతూ, విభజన చట్టంలోనే గవర్నర్ కు శాంతిభద్రతల బాధ్యత ఉందని తెలిపారు. హైదరాబాదు అభివృద్ధి, తెలంగాణకు మేలు జరగాలంటే బాధ్యత గవర్నర్ కే ఉండాలని స్పష్టం చేశారు.