: గ్యాస్, కిరోసిన్ ధరలను పెంచం: కేంద్ర పెట్రోలియం మంత్రి
గ్యాస్, కిరోసిన్ ధరలను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచనుందనే వార్తలు దేశ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు. ఇప్పటికిప్పుడు ధరలను పెంచే ఆలోచన కూడా లేదని స్పష్టం చేశారు. అయితే, సబ్సిడీ భారాన్ని తగ్గించుకునేందుకు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు.