: జర్నలిస్ట్ సంఘం నేత దేవులపల్లి అమర్ అరెస్ట్
తెలంగాణలో టీవీ9, ఏబీఎన్ చానళ్ల నిలిపివేతను నిరసిస్తూ జర్నలిస్టులు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. బషీర్ బాగ్ నుంచి సచివాలయం వరకు చేపట్టిన ర్యాలీని టూరిజం కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. జర్నలిస్టులను అదుపులోకి తీసుకుని బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో జర్నలిస్టు సంఘం నేత, ఐజేయూ సెక్రటరీ దేవులపల్లి అమర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అమర్ మాట్లాడుతూ, అరెస్టులతో మీడియా గొంతు నొక్కలేరని హెచ్చరించారు. మీడియాను నియంత్రించాలనుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థను కూలదోయడమే అని అన్నారు.