: సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు జర్నలిస్టుల యత్నం... అరెస్టులు... ఉద్రిక్తత


తెలంగాణలో టీవీ9, ఏబీఎన్ చానళ్ల ప్రసారాలను నిలిపివేయడాన్ని నిరసిస్తూ జర్నలిస్టులు చేపట్టిన భారీ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. హైదరాబాదులోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ నుంచి సచివాలయం వరకు చేపట్టిన వీరి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. టూరిజం కార్యాలయం వద్ద జర్నలిస్టులను నిలువరించిన పోలీసులు... వారు సచివాలయం వైపు పోకుండా అడ్డుగోడలా నిలబడ్డారు. ఈ క్రమంలో సచివాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేసి బలవంతంగా పోలీసు వాహనంలో గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, జర్నలిస్టులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జర్నలిస్టులకు మద్దతుగా పలువురు రాజకీయ నేతలు, ప్రజాసంఘాల నేతలు కూడా ర్యాలీలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News