: లోక్ సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా
లోక్ సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ధరల పెంపుపై చర్చ చేపట్టాల్సిందేనంటూ సభలో ప్రతిపక్ష, విపక్ష సభ్యులు తీవ్ర ఆందోళన చేస్తూ స్పీకర్ వెల్ లోకి వెళ్లి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు ఏమాత్రం వీలులేకపోవడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.