: రైతుల కోసం డిగ్గీ రాజా నిరశన దీక్ష


కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సొంత రాష్ట్రంలో రైతుల వెతలపై పోరుకు నడుం బిగించారు. మధ్యప్రదేశ్ లోని గుణా జిల్లా కేంద్రంలో ఆయన నేటి నుంచి వారం రోజుల పాటు నిరాహార దీక్ష చేయనున్నారు. ప్రకృతి కన్నెర్ర కారణంగా నష్టపోయిన రైతులకు మధ్యప్రదేశ్ సర్కారు ఆపన్న హస్తం అందివ్వడంలేదంటూ డిగ్గీ రాజా ఈ దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ సర్కారు రైతులకు తగిన నష్టపరిహారం ఇవ్వడంలో విఫలమైనందునే తాను నిరాహార దీక్ష చేయాల్సి వస్తోందని దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్లో తెలిపారు.

  • Loading...

More Telugu News