: హైదరాబాదులో స్థానికేతరుల సమస్యలపై పార్లమెంటులో టీడీపీ వాయిదా తీర్మానం
ఈ రోజు పదకొండు గంటల నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాదులో స్థానికేతరుల సమస్యలపై లోక్ సభ, రాజ్యసభల్లో టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ మేరకు ప్రశ్నోత్తరాలు రద్దు చేసి వాయిదా తీర్మానంపై చర్చించాలని లోక్ సభ స్పీకర్ కు ఎంపీ శివప్రసాద్, రాజ్యసభ ఛైర్మన్ కు సుజనా చౌదరి తీర్మానాలు అందజేశారు.