: చానళ్ల ప్రసారాల నిలిపివేతకు నిరసనగా నేడు జర్నలిస్టుల భారీ ర్యాలీ


తెలంగాణలో టీవీ9, ఏబీఎన్ చానళ్ల ప్రసారాల నిలిపివేతపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు తెలంగాణ ప్రాంత జర్నలిస్టులు 'చలో హైదరాబాద్' పేరుతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పాల్గొనడానికి అన్ని జిల్లాల నుంచి జర్నలిస్టులు హైదరాబాద్ కి తరలి వచ్చారు. ఉదయం 10.30 గంటలకు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ నుంచి ర్యాలీ మొదలవుతుంది. ఈ కార్యక్రమానికి పలు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. ర్యాలీలో జర్నలిస్టులతో కలసి అడుగు వేస్తామని ప్రకటించాయి.

  • Loading...

More Telugu News