: వింబుల్డన్ లో 'జోకర్' నవ్వాడు!


ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టెన్నిస్ చాంపియన్ షిప్ పురుషుల విభాగం టైటిల్ టాప్ సీడ్ నోవాక్ జోకోవిచ్ వశమైంది. ఇటీవలి కాలంలో గాయాలు, ఫామ్ లేమి వంటి సమస్యలతో తీవ్రంగా సతమతమయిన ఈ సెర్బియా యోధుడు టైటిల్ తో సత్తా చాటాడు. టెన్నిస్ కోర్టు బయట ఎంతో చలాకీగా, నవ్వుతూ నవ్విస్తూ ఉండే ఈ 'జోకర్' మోములో చాన్నాళ్ళ తర్వాత దరహాసం కనిపించింది.
ఫైనల్లో స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ను 6-7 (7-9), 6-4, 7-6 (7-4), 5-7, 6-4తో ఓడించి కెరీర్లో రెండో వింబుల్డన్ టైటిల్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ విజయం ద్వారా జోకోవిచ్... నడాల్ ను వెనక్కినెట్టి ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకుని తిరిగి కైవసం చేసుకోవడం విశేషం.

  • Loading...

More Telugu News