: నడుము వద్ద కొవ్వుందా.. కిడ్నీ వ్యాధి పొంచి ఉన్నట్టే!
ప్రమాదకరమైన కిడ్నీ వ్యాధులకు నడుము వద్ద పేరుకుపోయే కొవ్వూ ఓ కారణమని పరిశోధకులు అంటున్నారు. నడము వద్ద అధిక కొవ్వు ఉండేవారిలో కిడ్నీ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువని తెలుస్తోంది. ఈ విషయమై అమెరికన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ తన జర్నల్ లో ఓ కథనం ప్రచురించింది. నడుము భాగంలో అధిక కొవ్వు, రక్తపోటు పెరగడానికి కారణమవుతుందట. తద్వారా ఆ ప్రభావం మూత్రపిండాలపై పడుతుందని సదరు జర్నల్ వెల్లడిస్తోంది. ఒబేసిటి ఉన్నవారిలో ఈ ప్రమాదం తీవ్రస్థాయిలో ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.