: గవర్నర్ కు ప్రత్యేక అధికారాల డ్రాఫ్ట్ పై కేసీఆర్ అసహనం


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ డ్రాఫ్ట్ వచ్చింది. ఉమ్మడి రాజధాని హైదరాబాదులో గవర్నర్ కు గల ప్రత్యేక అధికారాలకు సంబంధించిన వివరాలు ఆ డ్రాఫ్ట్ లో ఉన్నాయి. ఈ రోజు టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. డ్రాఫ్ట్ లో కొన్ని అనవసరమైన అంశాలను చేర్చారని అన్నారు. దీనికి సంబంధించి పార్లమెంటులో నిరసన తెలిపి, తీవ్రంగా వ్యతిరేకించాలని ఎంపీలకు కేసీఆర్ సూచించారు.
అసలు ఆ డ్రాఫ్ట్ లో ఏముందంటే.... విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాదులో ప్రత్యేక పోలీస్ బోర్డు ఏర్పాటు చేస్తారు. ఈ బోర్డుపై అజమాయిషీ అంతా గవర్నర్ కే ఉంటుంది. విభజన చట్టంలోని ఆర్టికల్ 8 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది. పోలీస్ బోర్డులో ఏపీ, తెలంగాణలకు చెందిన డీసీపీ, ఏసీపీలు ఉంటారు. వీరి బదిలీలకు సంబంధించిన అధికారం కూడా గవర్నర్ కే ఉంటుంది. డ్రాఫ్ట్ లోని ఈ అంశాలపై అభిప్రాయాలను చెప్పాల్సిందిగా కేసీఆర్ ను కేంద్రం కోరింది. దీనికితోడు, మరికొన్ని బాధ్యతలను కూడా గవర్నర్ కు ఇవ్వాలని భావిస్తున్నట్టు డ్రాఫ్ట్ లో వెల్లడించింది.

  • Loading...

More Telugu News