: ఇంద్రకీలాద్రిపై ఈ నెల 10 నుంచి ఉత్సవాలు


విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానంలో ఈ నెల 10 నుంచి శాకంబరీ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో త్రినాథ్ రావు తెలిపారు. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగుతాయని చెప్పారు. తొలిరోజు విఘ్నేశ్వర పూజ, దీక్షధారణ, కలశ స్థాపన, ఆకు కూరలతో అమ్మవారికి అలంకరణ, అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాలు ఉంటాయి. రెండో రోజు చండీ హోమం, కూరగాయలతో అమ్మవారికి అలంకరణ, ప్రత్యేక హారతులు ఉంటాయి. మూడో రోజు వివిధ రకాల పండ్లతో అమ్మవారిని అలంకరిస్తారు.

  • Loading...

More Telugu News